Thursday, January 23, 2025

రూ.854 కోట్ల సైబర్ కుంభకోణం… ఆరుగురి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: దేశంలో సైబర్ నేరాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. తాజాగా రూ. 854 కోట్ల భారీ ఆన్‌లైన్ మోసాన్ని బెంగళూరు పోలీస్‌లు బయట పెట్టారు. పెట్టుబడులపై రోజుకు రూ.5 వేల వరకు లాభమంటూ ఆశ జూపి, దేశ వ్యాప్తంగా వేలాది మంది నుంచి సైబర్ నేరగాళ్లు రూ. కోట్లు కొల్లగొట్టారు. ఈ స్కామ్ గుట్టును రట్టు చేసిన పోలీస్‌లు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 5 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు వాట్సప్, టెలిగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో బాధితులకు లాభాల ఆశ చూపారని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు. రూ. 1000 నుంచి రూ.10 వేల వరకు పెట్టుబడి పెడితే రోజుకు వెయ్యి నుంచి రూ. 5 వేల వరకు లాభం పొందవచ్చని తొలుల నిందితులు ప్రకారం చేశారు.

దీంతో దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో చాలా మంది చిన్న మొత్తాలతో తమ పెట్టుబడులు ప్రారంభించారు. తొలినాళ్లలో వాటిపై లాభాలు రావడంతో ఆ తర్వాత వారు రూ. లక్ష నుంచి రూ. 10 లక్షల వరకు పెట్టుబడులు పెట్టారు. ఆన్‌లైన్‌లో పలు బ్యాంకు ఖాతాల్లో బాధితులు ఈ పెట్టుబడులను పెట్టారు. అయితే ఇన్వెస్టిమెంట్ ప్రక్రియ పూర్తయిన తర్వాత వారికి ఎలాంటి లాభాలు రాలేదు. దీంతో వారు తమ డబ్బులను విత్‌డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా, అది కూడా విఫలమైంది. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీస్‌లను ఆశ్రయించారు. పోలీస్‌ల దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగు లోకి వచ్చాయి. దేశ వ్యాప్తంగా వేలాది మంది ఈ కుంభకోణానికి మోసపోగా, వీరి నుంచి దాదాపు రూ. 854 కోట్లను కొల్లగొట్టినట్టు తేలింది. బాధితుల నుంచి పెట్టుబడులు సేకరించిన తర్వాత , నిందితులు ఆ మొత్తాన్ని క్రిప్టో, పేమెంట్ గేట్‌వే, గేమింగ్ యాప్స్ వంటి ఇతర ఖాతాలకు బదిలీ చేసుకున్నట్టు తెలిసింది. ప్రస్తుతం పోలీస్‌లు ఈ కేసుపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News