Sunday, December 22, 2024

ఆగని ధన ప్రవాహం.. తూఫ్రాన్ పేట చెక్‌పోస్ట్ వద్ద రూ. 90 లక్షలు సీజ్

- Advertisement -
- Advertisement -

Rs 90 lakh seized at Toopran Peta check post

మునుగోడు ఉప ఎన్నిక

మన తెలంగాణ/హైదరాబాద్ : మునుగోడు ఉప ఎన్నిక వేళ పోలీసులు, ఎన్నికల అధికారులు నిర్వహిస్తున్న దాడుల్లో భారీ స్థాయిలో నగదు పట్టుబడుతోంది. ఓటర్‌ను ప్రభావితం చేసే అంశంగా భావిస్తున్న నగదు, లిక్కర్‌ని కట్టడి చేయాల్సిందేనని ఇసి ఆదేశాలతో పోలీసులు, ఎన్నికల అధికారులు రంగంలోకి దిగి దాడులు నిర్వహిస్తున్న క్రమంలో భారీ మొత్తంలో నగదు పట్టుబడుతోంది. ఓ వైపు హవాలా మార్గంలో నగదు తరలిస్తున్న క్రమాన్ని పోలీసులు ఛేదిస్తున్నారు. మరోవైపు వాహనాల తనిఖీలను ముమ్మరం చేస్తున్న క్రమంలోనూ భారీ మొత్తంలో నగదు చిక్కుతోంది.

తాజాగా చౌటుప్పల్ మండలంలోని తూప్రాన్ పేట చెక్ పోస్టు వద్ద మంగళవారం వాహనాల తనిఖీలమ సమయంలో రూ.90 లక్షలను పోలీసులు సీజ్ చేశారు. మునుగోడు ఉప ఎన్నికను పురస్కరించుకొని ఉమ్మడి నల్గొండ జిల్లాలో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్నారు. చౌటుప్పల్ మండలం తూఫ్రాన్ పేట వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టు వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో స్కార్పియోలో తరలిస్తున్న రూ.90 లక్షలను పోలీసులు సీజ్ చేశారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో లెక్కచూపని రూ.6.80 కోట్ల నగదును సీజ్ చేసినట్టుగా అధికారులు ప్రకటించారు. మునుగోడు నియోజకవర్గంతో పాటు , హైద్రాబాద్ నగరంలో కూడా భారీగా నగదును పోలీసులు పట్టుకున్నారు. వాహనాల తనిఖీల సమయంలో భారీగా నగదు పట్టుబడింది.

గత నెల 31న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో రూ.90 లక్షలను పోలీసులు సీజ్ చేశారు. కచ్చితమైన సమాచారం మేరకు పోలీసులు ఈ వాహనాన్ని తనిఖీ చేయగా డబ్బు బయటపడింది. ఈ నగదుకు సంబంధించి సరైన ఆధారాలు చూపకపోవడంతో నగదును సీజ్ చేసినట్టుగా పోలీసులు తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్ 23న హైద్రాబాద్ లో రూ.70 లక్షలను పోలీసులు సీజ్ చేశారు. బేగంబజార్ నుండి కొందరు మునుగోడుకు డబ్బులు తరలిస్తున్నారనే సమాచారం మేరకు వాహనాలు తనిఖీలు చేశారు. కోఠి వద్ద కారులో రూ.70 లక్షలను తరలిస్తుండగా పోలీసులు ఆ నగదును సీజ్ చేశారు.అదే రోజున మరో రూ.10 లక్షలను పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు సీజ్ చేశారు. ఈ నెల 11న హైద్రాబాద్ బంజారాహిల్స్ లో రూ. 2 కోట్ల విలువైన హవాలా నగదును పోలీసులు సీజ్ చేశారు. నాలుగు రోజుల వ్యవధిలో హైద్రాబాద్ లో రూ. 10 కోట్ల నగదును పోలీసులు సీజ్ చేశారు.

నగరానికి చెందిన వ్యాపారికి చెందిన నగదుగా పోలీసులు గుర్తించారు. ఈ నెల 10న హైద్రాబాద్ గాంధీ నగర్ లో భారీగా నగదును సీజ్ చేశారు. రూ. 3.5 కోట్ల నగదును పోలీసులు సీజ్ చేశారు.. వాహనాలను తనిఖీలు చేసే సమయంలో కారులో నగదును తరలిస్తుండగా పోలీసులు ఈ నగదును సీజ్ చేశారు. అక్టో బర్ 7న జూబ్లీహిల్స్ లో రూ. 50లక్షలను హవాలా రూపంలో తరలిస్తున్న సమయంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.. అక్టోబర్ 8వ తేదీన పాతబస్తీలో రూ.79 లక్షలను పోలీసులు సీజ్ చేశారు.అక్టోబర్ 9వ తేదీన హైద్రాబాద్ జూబ్లీహిల్స్ లో రూ. 2.5 కోట్ల విలువైన నగదును పోలీసులు సీజ్ చేశారు. అక్టోబర్ 21న హైద్రాబాద్ నగరంలో సుమారు కోటికిపైగా నగదును పోలీసులు సీజ్ చేశారు. నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు నగదును తరలిస్తున్న కారుతో పాటు నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News