- Advertisement -
తమిళనాడులోని అధికార డిఎంకె పార్టీకి చెందిన ఎంపి, ప్రముఖ వ్యాపారవేత్త ఎస్.జగత్రక్షకన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) భారీ షాక్ ఇచ్చింది. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు రూ. 908 కోట్ల జరిమానా విధించింది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం(ఫెమా) నిబంధనల ఉల్లంఘన కేసులో ఈ భారీ జరిమానా విధించినట్లు ఇడి స్పష్టం చేసింది.
ఈ నెల 26వ తేదీన ఇచ్చిన తీర్పుకు లోబడి ఈ చర్యలకు ఉపక్రమించింది. ఇక ఫెమా చట్టంలోని 37ఎ సెక్షన్ ప్రకారం 2020 సెప్టెంబర్‌లో జప్తు చేసిన రూ. 89.19 కోట్ల మొత్తాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఆదేశాలు ఉన్నాయని, ఈ మొత్తాన్ని కూడా జరిమానాలో కలిపినట్టు ఇడి వెల్లడించింది. ఇదిలా ఉండగా వ్యాపారవేత్త అయిన జగత్రక్షకన్ ప్రస్తుతం అరక్కోణం పార్లమెంట్ స్థానం నుంచి లోక్‌సభ సభ్యుడిగా కొనసాగుతున్నారు.
- Advertisement -