Sunday, January 19, 2025

కాంట్రాక్టర్ల ఇళ్లపై ఐటీ దాడులు.. రూ. 94 కోట్ల నగదు, బంగారం పట్టివేత

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కర్ణాటకతోపాటు అనేక రాష్ట్రాల్లో ఆదాయపు పన్ను అధికారులు సోదాలు చేపట్టారు. దాదాపు నాలుగు రోజుల పాటు సాగిన ఈ దాడుల్లో భారీగా డబ్బు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక లోని ప్రభుత్వ కాంట్రాక్టర్లు, బిల్డర్లు, నగల వ్యాపారుల నివాస ప్రాంగణాల్లో ఈ దాడులు జరిగాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సిబిడిటి) సోమవారం వెల్లడించింది. కర్ణాటక, ఢిల్లీతోపాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు నగరాల్లో మొత్తంగా 55 చోట్ల అక్టోబర్ 12 నుంచి కొనసాగిన ఐటీ దాడుల్లో

రూ. 94 కోట్ల నగదు, రూ. 8 కోట్ల విలువైన బంగారం, వజ్రాభరణాలు, 30 లగ్జరీ వాచ్‌లను స్వాధీనం చేసినట్టు తెలియజేసింది. లెక్కల్లోకి రాని వీటిని సీజ్ చేసినట్టు ప్రకటనలో పేర్కొంది. వీటి మొత్తం విలువ రూ. 102 కోట్లు ఉండొచ్చని అంచనా వేసింది. అలాగే చేతి గడియారాల వ్యాపారంతో సంబంధం లేని ఒక ప్రైవేట్ ఉద్యోగి నివాసంలో 30 విదేశీ రిస్ట్ వాచ్‌లను సీజ్ చేసినట్టు పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News