Sunday, December 22, 2024

రాజ్యసభ ఉప ఎన్నిక: తెలంగాణ నుంచి అభిషేక్ మను సింఘ్వీ నామినేషన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ నుంచి రాజ్యసభకు జరిగే ఉప ఎన్నికకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యూసి) సభ్యుడు అభిషేక్ మను సింఘ్వీ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు.  ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, తుమ్మల నాగేశ్వరరావు, పి.శ్రీనివాస్‌ రెడ్డి, తెలంగాణ ఏఐసిసి ఇన్‌చార్జి దీపా దాస్‌మున్షీ, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు తోడు రాగా సింఘ్వీ రాష్ట్ర అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డి ముందు తన నామినేషన్ దాఖలు చేశారు.

కాంగ్రెస్ నేతలు తెలిపిన వివరాల ప్రకారం.. మూడుసార్లు ఎంపీగా ఎన్నికైన సింఘ్వీ నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.  సెప్టెంబరు 3న జరగనున్న ఉపఎన్నికకు ఇప్పటి వరకు నామినేషన్‌ దాఖలు చేసిన మొదటి అభ్యర్థి ,ఏకైక అభ్యర్థి కాంగ్రెస్‌ నాయకుడు సింఘ్వీయే.

గత నెలలో కాంగ్రెస్‌లో చేరిన బిఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ కె. కేశవరావు రాజీనామా చేయడంతో ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. నామినేషన్ల దాఖలుకు ఆగస్టు 21 చివరి తేదీ, పరిశీలన తేదీ ఆగస్టు 22. అభ్యర్థిత్వ ఉపసంహరణకు ఆగస్టు 27 చివరి తేదీ.

ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌)కి  అభ్యర్థిని నిలబెట్టే సంఖ్య లేకపోవడంతో సింఘ్వీ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికవుతారని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News