Monday, December 23, 2024

రూ. 50 కోట్లతో ఐటి హబ్ నిర్మాణం

- Advertisement -
- Advertisement -

నిజామావాద్ బ్యూరో: అంతర్జాతీయ సంస్థలకు వేదికగా నిజామాబాద్ నగరం తయారైందని, ఐటి నిర్మాణంతో యువతకు సువర్ణావకాశం లభిస్తుందని అర్బన్ ఎంఎల్‌ఏ బిగాల గణేష్ గుప్తా అన్నారు. శనివారం నగరంలోని బైపాస్ రోడ్డు నూతన కలెక్టరేట్ సముదాయం సమీపంలో నిర్మిస్తున్న ఐటి హబ్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటి రంగం విస్తరిస్తోందని అందులో భాగంగానే నిజామాబాద్ నగరంలో రూ. 50 కోట్ల వ్యయంతో ఐటి హబ్ నిర్మాణం చేపట్టడం జరిగిందని, ఇది ప్రారంభానికి సిద్ధంగా ఉందన్నారు.

ఈ ఐటి హబ్ ప్రారంభమైతే యువతకు సువర్ణాకాశం లభిస్తుందని, ప్రత్యేకంగా 560మందికి ఉద్యోగాలు, పరోక్షంగా అంతకు 4 రెట్లు ఎక్కువగా ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. త్వరలోనే ఐటి శాఖ మంత్రి కెటిఆర్ ఈ ఐటిహబ్‌ను ప్రారంభిస్తారని అన్నారు. సకల వసతులతో విశాలమైన వాతావరణంలో సమీకృత కలెక్టర్ కార్యాలయానికి చేరువలో నిర్మించిన ఈ ఐటి హబ్ భవనం త్వరలో ప్రారంభించడం జరుగుతుందన్నారు. గతంలో ఐటి అంటేనే హైదరాబాద్, పూణే, బెంగళూరు వంటి నగరాలు గుర్తుకు వచ్చేవని, ప్రస్తుతం ద్వితీయ శ్రేణినగరాలకు కూడా ప్రభుత్వం ఐటి హబ్‌లను విస్తరిస్తోందని అన్నారు. నిజామాబాద్ నగరంలో ఐటి హబ్ మణిహారంగా మారనుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News