Wednesday, January 22, 2025

ఐఐటి విద్యార్థులకు రూ.కోటి ప్యాకేజి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులకు అంతర్జాతీయ అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. క్యాంపస్ ప్లేస్‌మెంట డ్రైవ్‌లో విద్యార్థులకు సంవత్సరానికి కోటిరూపాయలకుపైగా ప్యాకేజీ లభించింది. ఐఐటి మద్రాస్‌కు చెందిన 25మంది విద్యార్థులకు ఏడాదికి రూ.కోటి ప్యాకేజి ఆఫర్స్ అందాయి. ఈ ఏడాది ఐఐటి మద్రాస్ ఇంతకుముందులేని రీతిలో అత్యధికంగా ప్రి ప్లేస్‌మెంట్ రికార్డు సృష్టించింది. గత ఏడాది విద్యార్థులుకు రూ.కోటికిపైగా వేతనంతో ఉద్యోగ అవకాశాలు రాగా ఈ ఏడాది మరో పదిశాతం అధికంగా ఉద్యోగ అవకాశాలు అత్యధిక వేతనంతో లభించాయి.

అదేవిధంగా ఐఐటీ గువాహటికి చెందిన 290మంది విద్యార్థులకు 84కంపెనీల నుంచి జాబ్ ఆపర్లు లభించాయి. ఐఐటి గువాహటి విద్యార్థులు ఐదుగురికి రూ.కోటి వార్షిక వేతనంతో ఆఫర్స్ లభించాయి. కాగా ఐఐటి మద్రాస్ విద్యార్థులుకు టెక్సాస్ ఇన్‌స్ట్రుమెంట్స్ నుంచి 14ఆఫర్లు, బజాజ్ ఆటోలిమిటెడ్ లయద చేతక్ టెక్ లిమిటెడ్ నుంచి 10 ఆఫర్లు, క్వాల్‌కాం నుంచి 8 ఆఫర్లు, జెపి మోర్గాను ఛేజ్ అండ్ కో నుంచి ప్రొక్టర్ అండ్ గ్యాంబిల్ నుంచి 7ఆఫర్లు, మోర్గాన్ స్టాన్లీ కంపెనీ నుంచి 6ఆఫర్లు, గ్రావిటన్ నుంచి 6, మెక్‌కిన్సే అండ్ కంపెనీ నుంచి కోహెస్టీ నుంచి ఆఫర్లు లభించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News