Wednesday, January 22, 2025

బహుజన ప్రభుత్వంలో జర్నలిస్టులందరికీ జాగాలిస్తాం: ఆర్ఎస్ ప్రవీణ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కెసిఆర్ సర్కారు వేల ఎకరాల ప్రభుత్వ భూమిని అమ్ముతోందని ఆర్ఎస్ ప్రవీణ్ ఆరోపించారు. తెలంగాణలో తమ హక్కుల సాధన కోసం పోరాటం చేస్తున్న జర్నలిస్టులకు ఆయన సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ మాట్లాడుతూ…. జర్నలిస్టులకు జాగాలు ఇచ్చేందుకు మాత్రం తెలంగాణ ప్రభుత్వం వెనకడుగు వేస్తోందన్నారు. సుప్రీంకోర్టు కేసు తేలిన తర్వాత కూడా జర్నలిస్టులకు జాగాలివ్వట్లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పదికోట్ల రూపాయలతో జర్నలిస్ట్ సంక్షేమ నిధి ఏర్పాటని హామీలిచ్చిన విషయం యధావిధిగా గా ‘కావాలనే’ మర్చిపోయారన్నారు.

అర్హులైన జర్నలిస్టులకు ఇండ్లు, జాగాలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. బహుజన ప్రభుత్వంలో జర్నలిస్టులందరికీ జాగాలిస్తామని ఆర్ఎస్ ప్రవీణ్ హామీ ఇచ్చారు. హక్కులకై పోరాడే జర్నలిస్టులకు బహుజన సమాజ్ వాది పార్టీ(బిఎస్ పి) మద్దతిస్తోందన్నారు. జర్నలిస్టులకు ఇళ్లు, జర్నలిస్ట్ భవన్ కడతామని కెసిఆర్ మేనిఫెస్టోలో చెప్పారని ఆయన గుర్తుచేశారు. జర్నలిస్టులకు కేటాయించిన భూములు కబ్జా అవుతున్నాయని ఆర్ఎస్ ప్రవీణ్ ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News