Monday, January 20, 2025

పసిబాలుడి చావు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గురుకుల పాఠశాలలో ఆ పసి బాలుడి చావు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అని బిఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. భువనగిరి ప్రభుత్వ గురుకుల పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై మాజీ గురుకుల పాఠశాల కార్యదర్శి బిఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. ఇంతకంటే ఇంకేమైనా ఘోరం ఉంటదా? అని ప్రశ్నించారు. గురుకుల పాఠశాలల్లో క్షేత్ర స్థాయి నియంత్రణ లోపించిందని, వ్యవస్థను చక్కదిద్దండి అని తాను ఎన్నో సార్లు వేడుకున్నా సిఎం రేవంత్ గుండె కరగడం లేదని విమర్శలు గుప్పించారు. కెసిఆర్ హయాంలో ప్రవేశపెట్టిన పనేషియా కమాండ్ సెంటర్ నేడు నిరాదరణకు గురైందని, 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఎలా నిరాదకరణకు గురైందో ఈ వ్యవస్థ కూడా అంతే అయిందని దుయ్యబట్టారు. పాఠశాలల్లో కౌన్సిలర్లు పెట్టమని వేడుకున్న కరుణించే నాధుడే లేడని, గత నాలుగు నెలలు ప్రతీకార రాజకీయాలకు మాత్రమే కాంగ్రెస్ పరిమితమైందని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు. పేద బిడ్డల కడుపుల్లో విషమెట్ల పడుతున్నదో తెలిసే అవకాశమే లేదని, ఈ చేతకాని కాంగ్రెస్‌ను అర్జంటుగా ఇంటికి పంపిద్ధామని పిలుపునిచ్చారు. మన బిడ్డల ప్రాణాలను మనం కాపాడుకుందామని రండి అని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News