Sunday, December 22, 2024

నాగర్ కర్నూలు, మెదక్ ఎంపీ స్థానాలకు వీరే బీఆర్ఎస్ అభ్యర్థులు!

- Advertisement -
- Advertisement -

నాగర్ కర్నూలు, మెదక్ పార్లమెంటు స్థానాలకు బిఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించింది. నాగర్ కర్నూలునుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను, మెదక్ నుంచి పి. వెంకట్రామిరెడ్డిని పోటీకి దించుతున్నట్లు పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. కాగా భువనగిరి, నల్లగొండ, సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల స్థానాలకు ఇంకా పార్టీ అభ్యర్థులను ప్రకటించవలసి ఉంది. గతంలో 10 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈమేరకు కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, పెద్దపల్లినుంచి కొప్పుల ఈశ్వర్, మహబూబ్ నగర్ నుంచి మన్నె శ్రీనివాసరెడ్డి, జహీరాబాద్ నుంచి గాలి అనిల్ కుమార్, ఖమ్మంనుంచి నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ నుంచి మాలోతు కవిత, మల్కాజిగిరినుంచి రాగిడి లక్ష్మారెడ్డి, ఆదిలాబాద్ నుంచి ఆత్రం సక్కు, నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి గోవర్దన్, వరంగల్ నుంచి కడియం కావ్య పోటీ చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News