- Advertisement -
మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ అయ్యారు. మంగళవారం బంజారాహిల్స్‌లోని నందినగర్ లో కేసీఆర్ నివాసానికి తన పార్టీ ప్రతినిధులతో కలిసి వెళ్లిన ప్రవీణ్ కుమార్.. ఆయనను మర్యాదపుపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా కెసిఆర్ ఆరోగ్య విషయాలను ఆర్ఎస్ పి అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలు విషయాలపై కెసిఆర్-ఆర్ఎస్ పి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు వీరిద్దరూ భేటీ కావడంతో రాజకీయంగా ఆసక్తి నెలకొంది. ఈ సమావేశంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డితోపాటు బాల్క సుమన్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -