Saturday, November 23, 2024

అనవసరంగా నన్ను అందులోకి లాగొద్దు: ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్

- Advertisement -
- Advertisement -

RS Praveen Kumar react on Huzurabad Contest

మనతెలంగాణ/హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నిక విషయంలో తాను ఎవరికో మద్దతు ఇస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం నమ్మవద్దని స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఐపిఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ట్వీట్ చేశారు. తన మద్దతు ఎప్పుడూ విద్య, వైద్యం, ఉపాధికేనని స్పష్టం చేశారు. హుజూరాబాద్‌లో వెదజల్లుతున్న డబ్బులను వాటికే ఖర్చు పెట్టాలని అన్నారు. ఇటీవలే పదవీ విరమణ చేసిన తాను.. ప్రస్తుతం ఓ ఇల్లు వెతుక్కునే పనిలో నిమగ్నమైనట్లు ఆయన తెలిపారు. తనను అనవసరంగా హుజూరాబాద్ వ్యవహారంలోకి లాగవద్దని.. అంచనాలు తలకిందులవుతాయని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు.

RS Praveen Kumar react on Huzurabad Contest

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News