Sunday, April 6, 2025

తెలంగాణలో మహిళలకు రక్షణ లేదు.. వారం రోజుల్లోనే నలుగురిపై అత్యాచారం..

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటంలో రేవంత్ సర్కార్ ఘోర వైఫల్యం చెందిందని మండిపడ్డారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు.

గత వారం రోజుల్లోనే నలుగురు మహిళలపై అత్యాచార ఘటనలు జరిగాయన్నారు. మేడ్చల్ ఎంఎంటీఎస్ మహిళా భోగిలో ఉన్నప్పటికీ మహిళపై అత్యాచారం జరిగిందని.. సంగారెడ్డి కందిలో భర్తను కట్టేసి అతని ముందే మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పారు. ఇక, నాగర్ కర్నూల్ లో క్రూరంగా ఓ గుడి దగ్గర మహిళపై సామూహిక అత్యాచారం జరిగిందని.. అలాగే, మార్చి 31న జర్మనీ మహిళపై హైదరాబాద్ పహాడీ షరీఫ్ లో అత్యాచారం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇన్ని అత్యాచారాలు జరుగుతున్న కాంగ్రెస్ సర్కార్ మాత్రం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. స్వయంగా ముఖ్యమంత్రే హోం మంత్రిగా ఉన్నా.. ఇన్ని అత్యాచారాలు జరగడం ఏంటని ప్రశ్నించారు.రాష్ట్రంలో ఘోరమైన ఘటనలు జరుగుతున్నా.. సిఎం రేవంత్ రెడ్డి వాటిపై కనీసం సమీక్షలు ఎందుకు పెట్టలేదు? ధ్వజమెత్తారు. పోలీస్ కమాండ్ కంట్రోస్ సెంటర్ లో కూర్చుని.. హెచ్ సియుకు సంబంధించిన భూములను ఎలా కొల్లగొట్టాలని ప్లాన్ చేస్తున్నారు తప్ప.. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాపై మాత్రం చర్చించడం లేదని ఆర్ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News