Monday, January 20, 2025

పెద్దోళ్ల దురాక్రమణలు కనిపించడం లేదా?.. పేదోళ్ల గుడిసెలే కనిపిస్తున్నాయా?: ఆర్ ఎస్ పి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జిహెచ్ఎంసి పరిధిలో బండ్లగూడ జాగీర్ మునిసిపాలిటీలోని పీరాన్ చెరువులోనే యధేచ్చగా పెద్ద పెద్ద భవంతులు అక్రమంగా నిర్మిస్తున్నారని బిఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. శుక్రవారం పీరాన్ చెరువులో వెలిసిన అక్రమాలకు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ లో ఆర్ఎస్ పి పోస్టు చేశారు.  ఎవరైనా అడుగుతే బడా నాయకులు తమకు  బాగా తెలుసునని, ఆర్ ట్యాక్స్ చెల్లించి భవంతులు కట్టుకుంటున్నామని అక్రమార్కులు అంటున్నారని చురకలంటించారు. కోర్టుకు ఎట్ల పోవాలో తమకు తెలుసు అని భూకబ్జాదారులు దబాయిస్తున్నారని, మరి ఇక్కడి అధికారులు ఏంచేస్తున్నారని ఆర్ఎస్ పి ప్రశ్నించారు. పేదోళ్ల ఇండ్లకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే శనివారం-ఆదివారం కూల్చేస్తున్నారని, హైడ్రాకు ఈ పెద్దోళ్ల దురాక్రమణలు కనిపించడం లేదా?.. పేదోళ్ల గుడిసెలే కనిపిస్తున్నాయా? అని ఆర్ఎస్ పి ఆగ్రహం వ్యక్తం చేశారు.  

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News