- Advertisement -
హైదరాబాద్ : ఐపిఎస్ అధికారిగా స్వఛ్చంద పదవీ విరమణ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బిఎస్‌పిలో చేరనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ అధికారికంగా ప్రకటించారు. ఈ నెల 8వ తేదీన(ఆదివారం) నల్గొండలో నిర్వహించనున్న రాజ్యాధికార సంకల్ప సభలో పార్టీ జాతీయ కో ఆర్డినేటర్, ఎంపి రాంజీ గౌతం నేతృత్వంలో ప్రవీణ్ కుమార్ పార్టీలో చేరుతారని తెలిపారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు నచ్చక ఐఎఎస్, ఐపిఎస్‌లు తమ పదవులను సైతం త్యాగం చేసి ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారని ప్రభాకర్ అన్నారు. సమాజంలో అణచివేత, అసమానతలు ఎదుర్కొంటున్న బహుజనులకు రాజ్యాధికారం దక్కాలన్న సంకల్పం కోసం తన ఆరున్నరేళ్ల పదవిని ప్రవీణ్ కుమార్ త్యాగం చేసినట్లు పేర్కొన్నారు. నల్గొండలో జరిగే ఈ సభకు బహుజనులు పెద్దసంఖ్యలో హాజరుకావాలని రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ కోరారు.
- Advertisement -