మనతెలంగాణ/హైదరాబాద్: మాజీ ఐపిఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ బిఎస్‌సి పార్టీలో చేరనున్నట్లు సమాచారం. అక్షరం, ఆర్థికం, ఆరోగ్యం అనే మూడు సిద్ధాంతాలతో బహుజన సమాజాన్ని ఉన్నత స్థాయికి చేర్చేందుకు తన ఉన్నతమైన పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టిన ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగస్టు 8వ తేదీన బిఎస్‌పి పార్టీలో చేరనున్నట్లు తెలిసింది. ప్రవీణ్‌కుమార్ రాజకీయ ప్రస్థానంపై అనేక పుకార్లు షికార్లు చేశాయి. మొదట టిఆర్‌ఎస్‌లో చేరి, హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఆ పార్టీ తరఫున పోటీకి దిగుతారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగగా, దానిని ఆయన ట్విట్టర్ వేదికగా ఖండించారు. సొంతంగా రాజకీయ పార్టీ పెడతారని, లేకపోతే రాష్ట్రంలో బహుజన సమాజ్ పార్టీ బీఎస్పీ బాధ్యతలు చేపట్టి, రాజకీయంగా ముందుకు వెళ్తారని సన్నిహితులు అంచనా వేశారు. అయితే ప్రవీణ్‌కుమార్ బిఎస్‌పిలో చేరేందుకు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.
RS Praveen Kumar will joins in BSP Party?