Wednesday, January 22, 2025

బిఆర్ఎస్ ప్రభుత్వంపై ఆర్ఎస్ ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

వికారాబాద్: బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బిఆర్ఎస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాండూర్ లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఎన్నికల స్టంట్ అన్నారు. పనులు పూర్తి కాకుండానే హడావుడిగా ప్రారంభిస్తున్నారని తెలిపారు. తెలంగాణలోని 30 వేల ఎకరాల అసైన్డ్ భూములను ప్రభుత్వం లాక్కొందని మండిపడ్డారు. అన్ని నియోజకవర్గాల్లో బిఎస్పీ పోటీ చేస్తోందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గద్దర్ కుటుంబాన్ని బీఎస్పీలోకి ఆహ్వానిస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News