Monday, December 23, 2024

దేశంలో అక్రమ డ్రగ్స్‌పై యుద్ధం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలోని వివిధ ప్రాంతాలలో సోమవారం అధికారులు 1.40 లక్షల కిలోల మాదకద్రవ్యాలను ధ్వంసం చేశారు. వివిధ ప్రాంతాలలో దాదుల దశలో వీటిని పట్టుకున్నారు. ధ్వంసం చేసిన డ్రగ్స్ విలువ సుమారు రూ 2381 కోట్లు. విధ్వంస ప్రక్రియను కేంద్ర హోం మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించారని అధికారులు తెలిపారు. సోమవారం ధ్వంసం చేసిన డ్రగ్స్‌లో నార్కోటిక్ కంట్రోలు బ్యూరో హైదరాబాద్ యూనిట్ స్వాధీనం చేసుకున్న 6590 కిలోల డ్రగ్స్ ఉన్నాయి. ఇప్పటివరకూ ఈ ఏడాది దేశంలో పట్టుకుని ధ్వంసం చేసిన డ్రగ్స్ మొత్తం పదిలక్షల కిలోలకు చేరింది. వీటి విలువ రూ 12వేల కోట్లు వరకూ పలుకుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News