Monday, December 23, 2024

ఎపిలో రివాల్వర్‌తో కాల్చుకుని ఆర్‌ఎస్‌ఐ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

RSI commits suicide by shooting himself with revolver

 

మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా హోమ్ గార్డ్స్ ఆర్.ఎస్‌ఐ ఈశ్వరరావు ఆదివారం నాడు తన నివాసంలో రివాల్వర్ తో రెండు రౌండ్లు కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. 2009లో కాకినాడలో ఈశ్వర్‌రావు ఆర్‌ఎస్‌ఐగా చేరి . 2019లో ఆర్‌ఐగా పోస్టింగ్ అయ్యారు. ఈక్రమంలో పోలీస్‌క్వార్టర్స్‌లో తన వద్దనున్న తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడం సంచలనం కలిగించింది.ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు, స్థానికులు వెంటనే ఈశ్వర్‌రావు మృతదేహాన్ని విజయనగరం జిల్లా ఆస్పత్రికి తరలించారు. విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఉన్న మృతదేహాన్ని ఎస్‌పి దీపిక పాటిల్ సందర్శించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News