Saturday, April 5, 2025

ప్రేమ వ్యవహారం… యువతిపై దాడి చేసిన ఆర్‌ఎస్‌ఐ

- Advertisement -
- Advertisement -

RSI love Young women

 

అమరావతి: ఆర్‌ఎస్‌ఐ ప్రేమ పేరిట ఓ యువతి మోసం చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ప్రకాశం జిల్లాలో ఓ ఆర్‌ఎస్‌ఐ విధులు నిర్వహిస్తున్నాడు. ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలో అమ్మాయితో పరిచయం ఏర్పడంది. పరిచయం ప్రేమగా మారడంతో పలుమార్లు కలుసుకునేవారు. ఇంజినీరింగ్ పూర్తి చేసిన తరువాత పోలీస్ జాబ్ కోసం కోచింగ్ తీసుకున్నాడు. ఆ సమయంలో ఇద్దరు మధ్య సాన్నిహిత్యం పెరిగింది. పోలీస్ శాఖలో ఉద్యోగం రావడంతో నెల్లూరులో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో యువతి హైదరాబాద్ నుంచి నెల్లూరుకు వెళ్లి అతడిని కలుస్తూ ఉండేది. ఈ మధ్యన ఆమెను దూరం పెడుతున్నాడు. జూన్ 10న ఇద్దరు మధ్య వాగ్వాదం జరగడంతో ఆమెపై అతడు దాడి చేశాడు. ఆమె 100కు కాల్ చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఆర్‌ఎస్‌ఐని అదుపులోకి తీసుకున్నారు. తీవ్రస్థాయిలో అతడిని మందలించి వదిలేశారు. ఇలాంటివి పునరావృతం కావొద్దని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News