నాగపూర్(మహారాష: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) అనుబంధ కార్మిక సంఘం భారతీయ మజ్దూర్ సంఘ్(బిఎంఎస్) కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వంపై సమరసంఖం పూరించింది. ప్రభుత్వ రంగ సంస్థల ప్రవేటీకరణ, కార్మిక చట్టాల సవరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా డిసెంబర్ 28న నాగపూర్‌లో శాసనసభకు నిరసన యాత్రను నిర్వహించనున్నట్లు బిఎంఎస్ ప్రకటించింది.
విదర్భ ప్రదేశ్ అధ్యక్షుడు శిల్పా దేశ్‌పాండే, ప్రధాన కార్యదర్శి గజానన్ గట్లేవార్, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్న ఒక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు బిఎంఎస్ ప్రచార విభాగ అధిపతి సురేష్ చౌదరి శనివారం తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను పెద్ద ఎత్తున ప్రైవేట్‌పరం చేయడం, కాంట్రాక్ట్ కార్మికులను వేధించడం తదితర కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 28న మహా మోర్చ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. బిఎంఎస్‌కు చెంది 20 వేల మంది సభ్యులు ఈ మోర్చలో పాల్గొంటారని ఆయన తెలిపారు.
బిఎంఎస్ వ్యవస్థాపకుడు దత్తోపంత్ తేంగడి జన్మస్థలం వార్ధాలోని అర్వి నుంచి సంకల్ప యాత్ర ప్రారంభమై 12 విదర్భ జిల్లాల మీదుగా 28న నాగపూర్‌కు చేరుకుంటుందని ఆయన పేర్కొన్నారు. నాగపూర్, చంద్రాపూర్, గడ్చిరోలి, గోండియ, భండారా, వార్ధా, అమ్రావతి, యావత్మాల్, అకోల, బుల్దానా, వాషిం జిల్లాల నుంచి కార్మికుల, వ్యవసాయ కార్మికులు ఈ యాత్రలో ప్లాంటారని ఆయన వివరించారు.