Monday, December 23, 2024

ఇకపై కశ్మీర్ పండిట్ల జోలికి ఎవరూ రాలేరు: మోహన్ భగవత్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కశ్మీర్ లోయ నుంచి 1990 దశకంలో తరిమివేయబడిన పండిట్లు మళ్లీ అక్కడికి వెళ్తే, వారిని మరోసారి ఎవరూ నిర్వాసితులను చేయబోరని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ చెప్పారు. నవ్‌రేహ్ వేడుకల చివరి రోజు అయిన ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కశ్మీర్ హిందువులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కశ్మీర్ పండిట్లు తమ ఇళ్లకు వెళ్లే రోజు చాలా దగ్గరలోనే ఉందని భావిస్తున్నామని, హిందువులుగా, భారత దేశ భక్తులుగా, వెళ్తామని, ఎవరూ మమ్మల్ని నిర్వాసితులను చేసే సాహసం చేయబోరనే విధంగా జీవిస్తాం అనే దృఢసంకల్పంతో వ్యవహరించాలని సూచించారు. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ది కశ్మీర్ ఫైల్స్ సినిమా కశ్మీర్ పండిట్లు నిరాశ్రయులైన దురదృష్టకర వాస్తవాన్ని తెలియజేసిందన్నారు. మనందరినీ దిగ్భ్రాంతికి గురి చేసిన దారుణాన్ని వివరించిందన్నారు. ప్రజలు అవగాహన పెంచుకోవడం ద్వారా కశ్మీర్ పండిట్ల సమస్య పరిష్కారమవుతుందని తాను గతంలో చెప్పానన్నారు. అధికరణ 370 వంటి అడ్డంకులు తొలగిపోయాయన్నారు.

RSS Chief Mohan Bhagwat comments on Kashmiri Pandits

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News