Monday, December 23, 2024

తమిళనాడు వ్యాప్తంగా 45 చోట్ల ఆర్‌ఎస్‌ఎస్ ర్యాలీ!

- Advertisement -
- Advertisement -

విల్లుపురం: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) ర్యాలీ కొత్త బస్ స్టాండ్ నుంచి మొదలై చౌరస్తా జంక్షన్, పిల్లయార్ టెంపుల్ బస్ స్టాప్, గాంధీ బొమ్మ గుండా సాగి పాత బస్ స్టాండ్ వద్ద ముగిసింది. ఈ ర్యాలీ సందర్భంగా డిఎస్పీ శ్రీనాథ నేతృత్వంలో 500 మంది పోలీసులను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. జనసమ్మర్ధ ప్రదేశాలలో జాగిలాలు, బాంబ్ స్కాడ్‌లతో తనిఖీలు చేపట్టారు. ఆర్‌ఎస్‌ఎస్ తన ర్యాలీలో కోర్టు మార్గదర్శకాలను పాటించింది. ర్యాలీ నిర్వహించే సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు వెదురు కర్రలను ఉపయోగించడానికి అనుమతివ్వబడలేదు. ఆర్‌ఎస్‌ఎస్ ర్యాలీ ముగిశాక మధ్యాహ్నం 3.00 గంటలకు విల్లుపురంలో బహిరంగ సమావేశం జరిగింది. తమిళనాడు వ్యాప్తంగా 45 చోట్ల ఆర్ఎస్ఎస్ ర్యాలీ నిర్వహించింది.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News