పుణె: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్)కు చెందిన 3 రోజుల సవన్వయ సమావేశాలు గురువారం మహారాష్ట్రలోని పుణెలో ప్రారంభమయ్యాయి. ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన 36 అనుబంధ విభాగాలకు చెందిన 267 మంది ప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరయ్యారు.
ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్, సర్‌కార్యవా దత్తాత్రేయ హొసబలె, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, విహెచ్‌పి, రాష్ట్రీయ సేవా భారతి, వనవాసి కళ్యాణ్ ఆశ్రమ్, ఎబివిపి, భారతీయ కిసాన్ సంఘ్, సంస్కృత భారతి, భారతీయ బజ్దూర్ సంఘ్ వంటి అనుబంధ సంస్థల ప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరయ్యారని ఆర్‌ఎస్‌ఎస్ ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రస్తుత సామాజిక, జాతీయ పరిస్థితులు, జాతీయ భద్రత, విద్య, జాతికి అందించాల్సిన సేవ, ఆర్థికం వంటి అంశాలపై ఈ సమావేశాలలో చర్చించనున్నారు. పర్యావరణం, స్నేహపూర్వక జీవన విధానం, సామాజిక సామరస్యతను పాటించడం వంటి అంశాలపై కూడా రచ్చించనున్నట్లు ఆర్‌ఎస్‌ఎస్ తెలిపింది.