Monday, December 23, 2024

తప్పుడు వార్తలు రాసిన పత్రికలపై ఆర్‌ఎస్‌ఎస్ కేసు

- Advertisement -
- Advertisement -

లక్నో: ఉత్తర్ ప్రదేశ్‌లోని అయోధ్యలో 100 ఎకరాలలో విలాసవంతమైన ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం నిర్మాణం జరుగుతున్నట్లు వార్తలు రాసిన, ప్రసారం చేసిన కొన్ని పత్రికలు, టివి చానళ్లపై ఆర్‌ఎస్‌ఎస్ అవధ్ ప్రాంత్ ప్రచార్ ప్రముఖ్ అశోక్ కుమార్ దూబే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచే రీతిలో ఈ వార్తలు ఉన్నాయని దూబే తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఆయన ఫిర్యాదు చేసిన వారిలో ఒక ప్రముఖ దినపత్రిక ఎగ్జిక్యుటివ్ ఎడిటర్, పలువురు విలేకరులు ఉన్నారు. లక్నోలోని హజ్రత్‌గంజ్ పోలీసు స్టేషన్‌లో ఈ మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఫిబ్రవరి 14న పత్రికలు ప్రచురించిన కథనం ఆర్‌ఎస్‌ఎస్ ప్రతిష్టను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసిసేలా ఉందని దూబే ఆరోపించారు. ఊహాజనిత అవాస్తవాలతో ఈ వార్తను తయారుచేశారని ఆయన ఆరోపించారు.

ఆర్‌ఎస్‌ఎస్ తన పంథాను వదిలి రాష్ట్ర ప్రభుత్వంతో కుమ్మక్కై అయోధ్యలో వంద ఎకరాల భూమిని సంపాదించిందినట్లు రాసిన ఈ వార్తతో ప్రజలలో ఆర్‌ఎస్‌ఎస్ పట్ల తప్పుడు అభిప్రాయాలు ఏర్పడే ప్రమాదం ఉందని దూబే తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వాస్తవానికి ఆర్‌ఎస్‌ఎస్‌కు చాలా ఏళ్లుగా అయోధ్యలోని సాకేత్ నిలయంలో కార్యాలయం ఉందని ఆయన తెలిపారు. తప్పుడు వార్తలు రాసి ఆర్‌ఎస్‌ఎస్ ప్రతిష్టను దెబ్బతీయడమే ఈ వార్త ప్రచురణ వెనుక ఉన్న దురుద్దేశమని ఆయన ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News