- Advertisement -
న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కుల వివాహం చట్టబద్ధతపై సుప్రీం కోర్టు వెలువరించిన అభిప్రాయాలను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) అభినందించింది. కోర్టు చట్టం చేయబోదని, చట్టంలోని అంశాలు మాత్రమే ప్రస్తావిస్తుందని, ఈ మేరకు ప్రత్యేక వివాహ చట్టాన్ని మార్పు చేసేది పార్లమెంట్ ఒక్కటేనని సుప్రీం కోర్టు తీర్పు చెప్పడాన్ని ప్రశంసించింది.
ఈ వివాదాస్పద అంశంతో ముడిపడి ఉన్న అన్ని విషయాల పైన పార్లమెంట్ ప్రజాస్వామ్య వ్యవస్థ తీవ్రంగా చర్చించి సరైన నిర్ణయం తీసుకోవలసిన అవసరం ఉందని ఆర్‌ఎస్‌ఎస్ కు చెందిన భారతీయ ప్రచార్ ప్రముఖ్ సూచించారు.
- Advertisement -