Wednesday, January 15, 2025

కేరళలో ఆర్ఎస్ఎస్ కార్యకర్త నరికివేత

- Advertisement -
- Advertisement -
RSS worker hacked to death in Kerala
ఒక గ్రామంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్ఐ) నాయకుడు హత్యకు గురైన 24 గంటల తర్వాత ఈ సంఘటన జరిగింది.

పాలక్కాడ్:  ఇక్కడ ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తను శనివారం మధ్యాహ్నం  ఓ ముఠా నరికి చంపినట్లు పోలీసులు తెలిపారు. పాలక్కాడ్ పట్టణం నడిబొడ్డున ఉన్న తన దుకాణంలో శ్రీనివాసన్ (45) అనే వ్యక్తిపై కొందరు దుండగులు దాడి చేశారు. నిందితులు ద్విచక్రవాహనంపై సంఘటనా స్థలానికి వచ్చినట్లు సమాచారం. బాధితుడిని వెంటనే ప్రయివేట్‌ ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రాణాపాయం నుంచి బయటపడలేదని అభిజ్ఞవర్గాల వారు తెలిపారు.

ఇక్కడికి సమీపంలోని ఒక గ్రామంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్ఐ) నాయకుడు హత్యకు గురైన 24 గంటల తర్వాత ఈ సంఘటన జరిగింది. జిల్లాలోని ఎలప్పుల్లి వద్ద సుబైర్ (43) అనే వ్యక్తి మసీదులో ప్రార్థనలు చేసి ఇంటికి తిరిగి వస్తుండగా నరికి చంపబడ్డాడు. ఈ దాడిపై బిజెపి స్పందిస్తూ, శ్రీనివాసన్ హత్య వెనుక పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా యొక్క రాజకీయ శాఖ అయిన సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఉందని ఆరోపించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News