- Advertisement -
న్యూఢిల్లీ : భారత్ నుంచి టర్కీ వెళ్లే ప్రయాణికులు 72 గంటలు ముందుగా ఆర్‌టిపిసిఆర్ నెగిటివ్ రిపోర్టు శనివారం నుంచి సమర్పించ వలసి ఉంటుందని టర్కీ రాయబార కార్యాలయం వెల్లడించింది. అలాగే టర్కీ వెళ్లాలనుకునే వారు భారత్‌లో ఎవరైతే ఉన్నారో వారు 14 రోజుల ముందుగానే ఆర్ పిసిఆర్ నెగిటివ్ రిపోర్టు సమర్పించాలని సూచించింది. సవరించిన ఈ నిబంధనలు సెప్టెంబర్ 4 నుంచి అమలు లోకి వస్తాయని వివరించింది. ప్రపంచ ఆరోగ్యసంస్థ ్ల లేదా టర్కీ ఆమోదించిన అత్యవసర వినియోగ వ్యాక్సిన్లు కనీసం రెండు డోసులైనా వేసుకున్నట్టు ధ్రువీకరించుకోవలసి ఉంటుందని సూచించింది. ఆఖరి డోసు వేసుకుని కనీసం 14 రోజులు గడవాలని పేర్కొంది. అలాంటి వారికి క్వారంటైన్‌లో ఉండాలన్న నిబంధన నుంచి మినహాయింపు ఉంటుందని పేర్కొంది.
- Advertisement -