Sunday, January 19, 2025

మాస్ కాంబోలో #RT4GM..

- Advertisement -
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనిల కాంబినేషన్ లో నాలుగో సినిమా రాబోతుంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ మేకర్స్ నిర్మించనున్న ఈ మూవీకి #RT4GM అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. గురువారం ఈ మూవీ టీమ్ సభ్యులు, పలువురు ప్రత్యేక అతిథుల సమక్షంలో పూజా కార్యక్రమం నిర్వహించారు.

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మేకర్స్‌కి స్క్రిప్ట్‌ అందజేశారు. ముహూర్తం షాట్‌కు అన్మోల్ శర్మ కెమెరా స్విచాన్ చేయగా, వివి వినాయక్ క్లాప్‌ ఇచ్చారు. తొలి షాట్‌కి కె రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. భారీ స్థాయిలో తెరకెక్కనున్న ఈ సినిమాలో రవితేజ మునుపెన్నడూ చూడని పాత్రలో కనిపించనున్నారు. ఇందులో ఇంధూజ రవిచంద్రన్, డైరెక్టర్ సెల్వరాఘవన్ కీలక పాత్రలు పోషించనున్నారు.

#RT4GM Movie Launched in Hyderabad

#RT4GM వాస్తవ సంఘటనల ఆధారంగా యూనిక్, పవర్ ఫుల్ కథతో రూపొందనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేయనున్నారు. సెన్సేషనల్ కంపోజర్ ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఈ చిత్రానికి ఎడిటర్ గా నేషనల్ అవార్డ్ విన్నింగ్ టెక్నీషియన్ నవీన్ నూలి, ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేయనున్నారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు.ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు మేకర్స్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News