Thursday, January 23, 2025

కాలం చెల్లిన ఆర్టీసి బస్సులు !

- Advertisement -
- Advertisement -

15 ఏళ్లు దాటిన బస్సులను రోడ్డెక్కనీయవద్దంటూ ఆర్‌టిఏ నోటీసులు
డిపోలో తగ్గుతున్న బస్సులు
త్వరలో మరో 600 బస్సులను ఆపివేయనున్న ఆర్టీసి
ఇతర డిపోల్లోకి కార్మికుల సర్ధుబాటు

RTA notice to RTC Old buses

మనతెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసి బస్సుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. కేంద్ర నిబంధనల ప్రకారం 15 ఏళ్లు దాటిన బస్సులను రోడ్డెక్కనీయవద్దంటూ రవాణా శాఖ నోటీసులు జారీ చేస్తోంది. ఈ నేపథ్యంలో బస్సుల సంఖ్య కూడా తగ్గిపోయింది. అందులో భాగంగా ఆర్టీసి అధికారులతో ఆ సంస్థ ఎండి సజ్జనార్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఒక్కో డిపో వారీగా వివరాలు తీసుకోవడంతో పాటు డిపో పరిధిలోని మొత్తం బస్సులు, తిరుగుతున్న ప్రాంతాలు, ఆదాయం, నష్టంతో పాటుగా సిబ్బంది, డిపోకు ఉన్న భూముల గురించి సమగ్రంగా వివరాలు సేకరించినట్టుగా సమాచారం. లాభ, నష్టాల ఎజెండానే ప్రత్యేకంగా ఆర్టీసి ఎండి సమావేశాలను నిర్వహిస్తున్నట్టుగా సమాచారం. మొత్తం 97 డిపోల పరిధి నుంచి అధికారుల సమగ్రంగా వివరాలను ఎండి సజ్జనార్‌కు అందచేసినట్టుగా తెలిసింది. 97 డిపోల పరిధి మొత్తం నష్టాల్లోనే ఉన్నాయని, కొన్నిచోట్ల ఈ నష్టాలు మూడింతలుగా ఉన్నట్టుగా తేలింది. ఫలితంగా తొలుత కొన్ని డిపోలును మూసివేసి అక్కడ పనిచేసే సిబ్బందిని వేరే డిపోల్లో సర్దుబాటు చేయాలని ఆర్టీసి అధికారులు నిర్ణయించినట్టుగా సమాచారం.

వేరే డిపోలకు సిబ్బంది ట్రాన్స్‌ఫర్ !

ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోరుట్ల లేదా మెట్‌పల్లి, హుజురాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్ -2 లేదా హన్మకొండ డిపో, ఘన్‌పూర్, నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి, హైదరాబాద్‌లోని జెబిఎస్ డిపోలను ఎత్తివేసే అవకాశం ఉన్నట్టుగా ఆర్టీసి వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఈ డిపోలకు సంబంధించిన బస్సులను పక్క డిపోలకు పంపించారని కార్మికులు పేర్కొంటున్నారు. డిపోలను ఎత్తివేసే ప్రయత్నాలు చేస్తున్న ప్రాంతాల్లో అక్కడ పనిచేసే సిబ్బందిని వేరే డిపోలకు ట్రాన్స్‌ఫర్ చేయాలని ఆర్టీసి అధికారులు నిర్ణయించినట్టుగా తెలిసింది. ప్రస్తుతం ఒక్క డిపోలో కనీసం 121 బస్సులు ఉండాల్సి ఉండగా 80 బస్సులకు తగ్గించారు. వీటిలో ఇప్పటివరకు గడువు మీరిన బస్సులు సగం మేరకు ఉన్నాయని కార్మికులు పేర్కొంటున్నారు.

దాదాపు 17 డిపోలను మూసివేయాలని…

ఇప్పటికే గ్రేటర్‌లో కొన్ని డిపోలకు ఎత్తివేశారు. హైదరాబాద్ -3 డిపోలో కార్యకలాపాలు ఆపేసి, సిబ్బందిని ఇతర డిపోలకు అటాచ్ శారు. మియాపూర్ డిపోను ఒకటి జిల్లాకు సర్దుబాటు చేశారు. ఇటీవలే పికెట్ డిపో క్లోజ్ అయినట్టుగా సమాచారం. తొలి విడతలో ఎక్కువ నష్టాలు వస్తున్న దాదాపు 17 డిపోలను మూసివేయాలని ఆర్టీసి నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. గత ఏడాది లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 97 ఆర్టీసి డిపోలుండగా 9,708 బస్సులు తిరిగాయి. ఇందులో 3,107 అద్దెకు తీసుకున్న బస్సులు ఉన్నాయి. త్వరలో అందులో కాలంచెల్లిన దాదాపు 600 బస్సులు పక్కన పెట్టనున్నట్టుగా తెలిసింది. ఆ బస్సుల స్థానంలో 500 ఎలక్ట్రికల్ బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకోవాలని ఆర్టీసి నిర్ణయించినట్టుగా సమాచారం. దీంతో చాలా డిపోల్లో బస్సుల సంఖ్య తగ్గిందని, స్టాఫ్ లేరని అధికారులు పేర్కొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News