Sunday, December 22, 2024

ఆర్‌టిసి అద్దె బస్సుకు తృటిలో తప్పిన ప్రమాదం

- Advertisement -
- Advertisement -

వికారాబాద్ : వికారాబాద్ జిల్లా, అనంతగిరి గుట్టలో ఆర్‌టిసి అద్దె బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. ధరూర్ ఎస్‌ఐ సంతోష్ తెలిపిన వివరాల ప్రకారం…తాండూర్ డిపోకు చెందిన అద్దె బస్సు హైదరాబాద్ నుండి తాండూర్ వెళ్తుండగా బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపు తప్పి పొదల్లోకి దూసుకెళ్లింది. బస్సులోని ప్రయాణికులకు ప్రాణాపాయం తప్పింది. ఈ ప్రమాదంలో 9 మందికి గాయాలయ్యాయి.

పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను వికారాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని వికారాబాద్ డిపో మేనేజర్ బక్షు నాయక్ పరిశీలించి, ఉన్నత అధికారులకు సమాచారం అందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఎదురుగా ఇతర వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అన్నారు.క్షతగాత్రులను వికారాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులకు తన వంతు సహాయంగా వెయ్యి రూపాయలు చొప్పున అందజేశానని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News