Monday, December 23, 2024

డీజిల్ ధరలు పెరిగితే మళ్లీ ఆర్టీసి ఛార్జీలు పెరిగే అవకాశం

- Advertisement -
- Advertisement -

డీజిల్ ధరలు పెరిగితే మళ్లీ ఆర్టీసి ఛార్జీలు పెరిగే అవకాశం:  ఆర్టీసి ఎండి సజ్జనార్

Two baby girls born in moving TSRTC buses get free travel

మనతెలంగాణ/హైదరాబాద్:  డీజిల్ ధరలు ఇదే విధంగా పెరిగితే మళ్లీ ఆర్టీసి ఛార్జీలు పెంచే అవకాశం ఉందని టిఎస్ ఆర్టీసి ఎండి సజ్జనార్ పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ డీజిల్ రేట్లు పెరగడం వల్లే చార్జీల పెంపునకు ప్రధాన కారణమని ఆయన తెలిపారు. తప్పని పరిస్థితుల్లో ఆర్టీసి ఛార్జీలు పెంచామన్నారు. ‘పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీకి 2 రూపాయలు, ఆపై బస్సులకు 5 రూపాయలు పెంచామన్నారు. కొత్త బస్సుల కొనుగోలు కోసం కొంత మంది బ్యాంకర్లు లోన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని, లోన్లు రాగానే కొత్త బస్సులు కొనుగోలు చేస్తామన్నారు. ఇప్పటికే ఉన్న కొన్ని బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మారుస్తున్నామని ఆర్టీసి ఎండి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News