Thursday, January 23, 2025

కారును ఢీకొన్న ఆర్‌టిసి బస్సు.. ఐదుగురు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

RTC bus collides with car five killed

మృతులు ఒకే కుటుంబసభ్యులు కామారెడ్డి-
సిరిసిల్ల ప్రధాన రహదారిపై ప్రమాదం

మన తెలంగాణ/మాచారెడ్డి : కామారెడ్డి సిరిసిల్ల ప్రధాన రహదారిపై ఆర్టీసి బస్సు కారును ఢీకొన్న ఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మాచారెడ్డి మండలంలోని ఘన్‌పూర్ గ్రామ శివారు ప్రాంతంలో జరిగింది. పూర్తి వివరాలు మాచారెడ్డి ఎస్సై సంతోష్ కుమార్ కథనం మేరకు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన వేల్పూరి సువర్ణ (65)స వేల్పూరి రాధాకృష్ణ (48), వేల్పూరి కల్పన (42) వెళ్లిపూరి శ్రీరామ్ (10), జెల్లి నరేందర్ (47) డ్రైవర్‌లు కలిసి నిజామాబాద్ నుండి కారులో బయలుదేరారు రాజన్న సిరిసిల్లా జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామానికి బయలుదేరారు. మాచారెడ్డి మండలంలోని ఘన్‌పూర్ శివారు చేరుకోగానే కారు నెం. టిఎస్16ఎఫ్‌బి4366 సిరిసిల్ల నుండి కామారెడ్డి వైపు వస్తున్న ఆర్‌టిసి బస్సు నెంబర్ టిఎస్ 02 యూసి 5740 అనే బస్సు వేగంగా కారును ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. కాగా గాయపడ్డ ఒక బాలికను కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స కోసం పంపించడం జరిగిందని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సంతోష్ కుమార్ తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News