Sunday, December 22, 2024

ట్రాక్టర్, కార్లకు ఆర్టీసీ బస్సు ఢీకొని ఆరుగురి మృతి

- Advertisement -
- Advertisement -

అహ్మద్‌నగర్ : మహారాష్ట్ర లోని అహ్మద్‌నగర్‌లో బుధవారం తెల్లవారు జామున ట్రాక్టర్, కార్లకు రాష్ట్ర ప్రభుత్వ రవాణా బస్సు ఢీకొన్ని ఆరుగురు మృతి చెందారు. అహ్మద్‌నగర్ కల్యాన్ రోడ్డులో దవలిపురి పతా వద్ద బుధవారం తెల్లవారు జామున 2.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీస్‌లు తెలిపారు.

ఆ రోడ్డులో చెరకు లోడుతో వెళ్తోన్న ట్రాక్టర్ బోల్తా పడడంతో అందులోనున్న చెరకును దించడానికి వేరే ట్రాక్టర్‌ను అక్కడకు తీసుకు వచ్చారు. వేరే ట్రాక్టర్ లోకి చెరకును లోడు చేస్తున్నప్పుడు కారుతో వచ్చిన డ్రైవర్ తన కారును ఆపి వారికి సాయం చేయసాగాడు. ఆ సమయంలో ట్రాక్టర్ రోడ్డుపై టర్న్ చేస్తుండగా, ఆర్టీసీ బస్సు వచ్చి ట్రాక్టర్‌ను కారును ఢీకొంది. కొంతమంది కార్మికులతో కూడిన ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News