Tuesday, January 21, 2025

ట్రాక్టర్‌ను ఢీకొన్న ఆర్‌టిసి బస్సు

- Advertisement -
- Advertisement -

RTC bus collides with tractor:3 killed

ముగ్గురు కూలీలు దుర్మరణం
మృతుల్లో ఇద్దరు
మహిళలు

మన తెలంగాణ/ యాదాద్రి : హైదరాబాద్‌-వరంగల్ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైవేపై రోడ్డు పనులు చేసే ముగ్గురు కూలీలు మృతి చెందగా మరొక మహి ళ పరిస్థితి విషమంగా ఉంది. ఆదివారం మధ్యా హ్నం చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ఉరేళ్ల శ్యామ్, అంకర్ల లక్ష్మీ ఘటనా స్థలిలోనే మృతి చెందిగా.. తీవ్రంగా గాయపడిన ఊరేళ్ల లావా ణ్య, అంకర్ల కవితను హైదరాబాద్‌కు తరలించారు. కాగా, చికిత్స పొందుతూ అక్కడ కవిత మృతి చెందిగా.. లావణ్య పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంపై ఘటనపై తోటి కూలీలు, పోలీసులు తెలిపిన వివరాలు.. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ పరిధిలో హైద్రాబాద్‌వరంగల్ హైవేపై రహదారి డివైడర్‌పై మొ క్కల పర్యవేక్షణ పనులు చేస్తుండగా వరంగల్ నుంచి హైదరాబాద్ వెళుతున్న ఆర్‌టిసి బస్సు కూలీలను ఢీకొని, సమీపంలో ఉన్న ట్రాక్టర్‌ను సైతం బలంగా ఢీకొందని తెలిపారు. ఘటనా స్థ లిని స్థానిక ఎంఎల్‌ఎ, ప్రభుత్వ విప్ గొంగిడి సు నీతా సందర్శించారు. బాధిత కుటుంబాలను ప్ర భుత్వం అండగాబెంటుందని, సిఎం కెసిఆర్ దృ ష్టికి తీసుకెళ్లి వారిని ఆదుకుంటామని హామీ. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News