Wednesday, January 22, 2025

ఆర్టీసి బస్సులో మందుబాబుల దాడి.. కండక్టర్ మృతి

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఆర్టీసి బస్సులో మందుబాబుల దాడిలో కండక్టర్ మృతి చెందిన ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో చోటుచేసుకుంది. చెన్నై నుంచి విల్లుపురం వెళ్తున్న బస్సులో కొందరు మందుబాబులు వీరంగం సృష్టించారు. టికెట్ తీసుకోవాలని అడిగినందుకు కండక్టర్ పై మందుబాబులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కండక్టర్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరపనున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. మృతి చెందిన కండక్టర్ పెరుమాళ్ పిళ్లై కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. నిందితులను అరెస్టు చేసి, చట్ట పరంగా శిక్షించాలని అధికారులను సిఎం స్టాలిన్ ఆదేశించారు.

RTC Bus Conductor killed by drinkers in Chennai

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News