Wednesday, January 29, 2025

జడ్చర్లలో ఘోర రోడ్డు ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

జడ్చర్ల:  మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం జడ్చర్ల మండలంలోని చిట్టి బోయిన్ పల్లి సమీపంలోని జాతీయ రహదారిపై అర్టీసి బస్సు అదుపుతప్పి కంటైనర్ ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి స్వల్పంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. గాయపడిని వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి పంపించారు. తిరుపతి డిపోకు చెందిన బస్సు జడ్చర్ల మీదుగా హైదరాబాద్ కు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

RTC Bus Driver died in Road Accident at Jadcherla

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News