- Advertisement -
గద్వాల: జిల్లాలోని ఇటిక్యాల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం మండలంలోని ధర్మారంలో ఆర్టీసి బస్సు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 43మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
RTC Bus Driver died in road accident in Gadwal
- Advertisement -