Sunday, December 22, 2024

ఆర్‌టిసి బస్సులో ప్రయాణీకుడికి ఫిట్స్..బస్సులోనే ఆసుపత్రికి తీసుకెళ్లిన డ్రైవర్

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ఆర్‌టిసి బస్సులో ఫిట్స్ వచ్చిన ప్రయాణీకుడిని ఆసుపత్రిలో చేర్పించి డ్రైవర్ ఉదారత చాటుకున్నారు. బస్సును నేరుగా ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రయాణీకుడి ప్రాణాల్ను కాపాడారు. వరంగల్ -2 డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు సోమవారం హైదరాబాద్ నుంచి హన్మకొండకు వెళ్తోంది. హైదరాబాద్ శివారు ఘట్ కేసర్ దాటగానే సంతోష్ అనే ప్రయాణీకుడికి బస్సులో ఒక్కసారిగా ఫిట్స్ వచ్చాయి. ఈ విషయాన్ని గమనించిన తోటి ప్రయాణికులు డ్రైవర్ బి.వెంకన్న దృష్టికి తీసుకెళ్లారు. వెంటేనే బస్సును పక్కకి ఆపి ఫిట్స్ వచ్చిన ప్రయాణికుడిని డ్రైవర్ పరిశీలించారు. ఆరోగ్య పరిస్థితి విషమిస్తుందని గుర్తించి, తోటి ప్రయాణీకుడు శ్రీనివాస్ సహాకారంతో సమీపంలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆస్పత్రికి బస్సును తీసుకెళ్లారు. సంతోష్‌ను ఆసుపత్రిలో చేర్పించారు. సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్ళడంతో సంతోష్ కు ప్రాణాప్రాయం తప్పింది.

సమయస్పూర్తితో వ్యవహారించి, సకాలంలో ప్రయాణీకుడిని ఆసుపత్రికి తీసుకెళ్లిన ఆర్‌టిసి డ్రైవర్ బి.వెంకన్నను హైదరాబాద్ బస్ భవన్‌లో మంగళవారం ఆర్‌టిసి యాజమాన్యం అభినందించింది. సంస్థ ఉన్నతాధికారులతో కలసి ఆయనను ఆర్‌టిసి ఎండి సజ్జనార్ సన్మానించారు. ఆపద సమయంలో అమూల్యమైన సేవాతత్పరతను ఆర్‌టిసి సిబ్బంది చాటుతున్నారని సజ్జనార్ అన్నారు. ప్రయాణీకులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు ఆపద సమయంలో తాము ఉన్నామని భరోసా కల్పిస్తున్నారని ప్రశంసించారు. సంతోష్‌ను ఆసుపత్రికి తరలించడంలో డ్రైవర్‌కు సహకరించిన ప్రయాణీకుడు శ్రీనివాస్‌కు, వైద్యం అందించిన ఎయిమ్స్ వైద్య బృందాన్ని సజ్జనార్ అభినందించారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, కృష్ణకాంత్, చీఫ్ ట్రాఫిక్ మేనేజ్ శ్రీదేవి, వరంగల్2 డిపో మేనేజ్ జ్యోస్న, తదితురులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News