Sunday, December 22, 2024

లోయలో పడిన ఆర్టీసీ బస్సు.. 20 మందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

ఆర్టీసీ బస్సు లోయలో పడడంతో దాదాపు 20 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని పులివెందుల వద్ద బుధవారం ఉదయం చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించబోయిన ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు అదుపుతప్పి 30 అడుగుల లోయలో పడిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్రంగా గాపడ్డారు.

విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమం తెలుస్తోంది. దీంతో చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కదిరి నుంచి పులివెందులకు బస్సు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News