Sunday, December 22, 2024

ఇన్నోవా కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, ఇన్నోవా కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇన్నోవా కారులో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News