Sunday, January 19, 2025

ఖమ్మంలో పెట్రోల్ టాంకర్ ను ఢీకొట్టిన ఆర్టీసి బస్సు.. (వీడియో)

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: ఏన్కూర్ నుండి ఖమ్మం బస్టాండ్ వస్తున్న పల్లె వెలుగు బస్సు, వైరా నుండి వరంగల్ వైపు వెళ్తున్న పెట్రోల్ ట్యాంకర్ ను అదుపుతప్పి సిగ్నల్స్ వద్ద ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. సిగ్నల్స్ పాస్ చేసి ముందుకు వస్తున్నటువంటి ఆయిల్ ట్యాంకర్ ను ఫ్రీ జోన్ నుంచి వస్తున్నటువంటి ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు ఒక్కసారిగా మెయిన్ రోడ్డు మీదకు రావడంతో అదుపుతప్పి ట్యాంకర్ ఢీకొట్టింది.

అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. పలువురు స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని రూట్ క్లియర్ చేశారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం దవాఖానాకు తరలించారు. అనంతరం ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News