Friday, December 27, 2024

పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్‌టిసి బస్సు

- Advertisement -
- Advertisement -

చెన్నారావుపేట: ఆర్‌టిసి బస్సు స్టీరింగ్ రాడ్ విరగడంతో ఒక్కసారిగా వరి పంట పొలాల్లోకి బస్సు దూసుకెళ్లిన సంఘటన వరంగల్ జిల్లా, చెన్నారావుపేట మండలం, తిమ్మరాయనిపహాడ్ గ్రామ శివారులో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. నర్సంపేట డిపో నుంచి ఆర్‌టిసి పల్లె వెలుగు బస్సు మండలంలోని బోజెర్వు గ్రామానికి వెళ్లి 30 మంది ప్రయాణికులను ఎక్కించుకొని తిరిగి నర్సంపేట వస్తోంది. తిమ్మరాయనిపహాడ్ గ్రామ శివారులోకి రాగానే బస్సు స్టీరింగ్ రాడ్ ఒక్కసారిగా విరిగిపోవడంతో రోడ్డు పక్కన ఉన్న వరి పంట పొలాల్లోకి దూసుకెళ్లి బురదలో ఆగిపోయింది. బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురికి స్వల్ప గాయాలు కాగా వారిని స్థానికులు వెంటనే 108 వాహనంలో నర్సంపేటకు తరలించారు. కాగా, పెద్ద ప్రమాదం జరగపోవడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News