Thursday, January 23, 2025

నెటిజన్ విజ్ఞప్తికి స్పందించిన ఆర్టీసి ఎండి

- Advertisement -
- Advertisement -

RTC bus service to Samathamurthy Statue

ముచ్చింతల్ సమతామూర్తి విగ్రహం వద్దకు వీకెండ్‌లో
ఆర్టీసి బస్సు సౌకర్యం కల్పించాలని అధికారులకు సజ్జనార్ ఆదేశం

మనతెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్ సమతామూర్తి విగ్రహం వద్దకు వీకెండ్‌లో ఆర్టీసి బస్సు సౌకర్యం కల్పించాలని అధికారులను ఆ సంస్థ ఎండి సజ్జనార్ ఆదేశించారు. సమతామూర్తి విగ్రహం వద్దకు నేరుగా ఆర్టీసి బస్సుల్లేవని, అక్కడికి వెళ్లేందుకు క్యాబ్ వాళ్లు రూ.1,000 వరకు వసూలు చేస్తున్నారని ట్విట్టర్‌లో ఎండి సజ్జనార్ దృష్టికి ఓ నెటిజన్ తీసుకెళ్లారు. వీకెండ్‌లో అక్కడికి ఆర్టీసి బస్సులను ఏర్పాటు చేస్తే సామాన్యులకు ఉపయోగకరంగా ఉంటుందని నెటిజన్ కోరారు. ఈ ట్వీట్‌కు సజ్జనార్ సానుకూలంగా స్పందించారు. ‘ఆర్టీసీ పట్ల మీ ఆసక్తికి ధన్యవాదాలు’. ‘ఈ మార్గంలో ఆర్టీసి బస్సును ఏర్పాటు చేయండి. అందుకు అనుగుణంగా సమయాలను అప్‌డేట్ చేయండి’ అని ఆర్టీసి అధికారులను ఎండి ఆదేశించారు. ఆర్టీసి ఉన్నతాధికారుల ఖాతాలను దీనిని ట్యాగ్ చేశారు. సమతామూర్తి విగ్రహం వద్దకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని ఆ ట్వీట్‌కు ఉన్నతాధికారులు సమాధానం ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News