Sunday, December 22, 2024

వాగు మధ్యలో చిక్కుకుపోయిన ఆర్టీసి బస్సు.. రాత్రి నుంచి అక్కడే ప్రయాణికులు..

- Advertisement -
- Advertisement -

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. మహబూబాబాద్ జిల్లాలోనూ భారీ వర్షాలకు వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో నెక్కొండ మండలం వెంకటాపురం గ్రామ చెరువు ఒక్కసారిగా పొంగిపొర్లడంతో వాగు వరదలో ఆర్టీసీ బస్సు చిక్కుకుపోయింది. వాగు మధ్యలో చిక్కుకుపోవడంతో రాత్రి నుంచి ఇక్కడే ఉన్నామని.. తాగడానికి నీళ్లు కూడా లేవని.. తమను కాపాడాలంటూ బంధువులను, అధికారులను ప్రయాణికులు వేడుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News