Saturday, November 9, 2024

రాంచంద్రపల్లికి కాలినడనవెళ్లిన ఆర్టీసి ఛైర్మన్

- Advertisement -
- Advertisement -

సిరికొండ: సిరికొండ మండలం రాంచంద్రపల్లి తాండా(సంగిలోడి తాండా జిపి)కు శనివారం రాష్ట్ర ఆర్టీసి చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ కాలినడకన వెళ్లారు. చింతల్‌తాండా నుండి రాంచంద్రపల్లికి రోడ్డు సౌకర్యం కల్పించాలని ఆ తాండా వాసులు గత ముప్పయి సంవత్సరాలుగా అధికారులను, ప్రజాప్రతినిధులను కోరుతున్నారు. అయితే చింతల్‌తాండ నుండి రాంచంద్రపల్లి తాండా వరకు సుమారు అయిదు కిలోమీటర్ల దూరం వుంది. ఈ అయిదు కిలోమీటర్లు దూరం మొత్తం దట్టమై అటవీ ప్రాంతంలో ఉండడం వలన అటవీ శాఖ వారు అభ్యంతరం తెలపడంతో రోడ్డు నిర్మాణానికి అవరోదం ఏర్పడింది. ప్రస్తుతానికి ఈ రెండు తాండాల మధ్య కాలిబాట వుంది. రామచంద్రపల్లి తాండా వాసులు ఏ చిన్న పనివున్నా కాలినడకన జగదాంబ తాండాకు, రావుట్ల రావలసిందే. ఈ విషయమై ఇటివలే ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తీవ్రంగా ఆలోచిస్తున్నాడు.

రోడ్డు నిర్మాణం చేయించి తీరుతానని రెండు తాండా వాసులకు హామి కూడ ఇచ్చాడు. ఇందులో భాగంగానే చింతల్ తాండాకు వచ్చిన ఎమ్మెల్యే అక్కడి నుండి కాలినడకన 5 కిలోమీటర్ల దూరం తీవ్రమైన ఎండవున్న నడిచి వెళ్లాడు, వెంట జిల్లా అటవీ అధికారి వికాస్ మీనన్‌ను తీసుకెళ్లి రోడ్డు పరిస్థితిన చూయించారు.ఇ రువురు కలిసి రోడ్డు మార్గాన్ని పరిశీలించారు. ఎంత తొందరగా అటవీ అనుమతు ఇప్పిస్తే అంత తొందరగా రొడ్డు వేయించి ఇస్తానని డిఎఫ్‌ఒ దృష్టికి ఎమ్మెల్యే తీపుకెళ్లారు అవసరమైతే రాష్ట్ర అధికారలతో మాట్లాడుతానని ఎమ్మెల్యే డిఎఫ్‌ఒతో చెప్పారు. డిఒఫ్‌ఒ సానుకూలంగా స్పందించారు. అనంతరం ఎమ్మెల్యే రెండు తాండా వాసులతో సమావేశమయ్యారు. అటవీ అధికారులు రోడ్డు మార్గాన్ని సర్వే చేయడానికి వస్తారని వారికి సహకరించాలని కోరారు. అనవసరంగా చెట్లు నరకవద్దని హితబోద చేశారు.

అటవీ శాఖ అనుమతులు రాగానే ముఖ్యమంత్రి తో మాట్లాడి రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం రహత్ నగర్ అడవలో డిఎఫ్‌ఒ వికాస్ మీనన్‌తో కలిసి భోజనం చేశారు. ఎమ్మెల్యే వెంట ధర్పల్లి జడ్పీటిసి సభ్యుడు జిల్లా ఒలంపిక్ సంఘం ఉపాధ్యక్షుడు బాజిరెడ్డి జగన్‌మోహన్,సిరికొండ జడ్పీటిసి మలావత్ మాన్‌సింగ్,సర్పంచులు భూక్య లతాగంగాధర్ తోట రాజన్న రావుట్ల ఉపసర్పంచు రఘవాస్, రాజునాయక్, కృష్ణ నాయక్, రెడ్యనాయక్,భూమేశ్, రాజు, గ్రామ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News