Sunday, January 19, 2025

ఆర్‌టిసి విలీనంపై కమిటీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వంలో ఆర్‌టిసి ఉద్యోగులు విలీనానికి సం బంధించిన సాధ్యాసాధ్యాలపై త్వరలోనే కమిటీ వేస్తామని రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. సచివాలయంలో మంత్రి పొన్నం శనివారం విలేకరులతో చిట్‌చా ట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ ఆర్‌టిసి ఉద్యోగుల విలీనానికి సంబంధించి ఫైలు గవర్నర్ దగ్గర ఉందని ఆయన అన్నారు. ఆర్‌టిసి ఆస్తుల గురించి తాము కమిటీ వేయడం లేదని, ఆర్టీసి ఉద్యోగుల అంశాలకు సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి తాము కమిటీని వేయాలని నిర్ణయించుకున్నామని ఆయన తెలిపారు. ఆర్‌టిసిని లాభాల బాటలోకి తీసుకురావాలన్న కృతనిశ్చయంతో సిఎం రేవంత్‌రెడ్డి ముందుకెళుతున్నారని ఆయన తెలిపారు. ఆర్టీసి స్థలాలను లీజుకు తీసుకొని ఏళ్లుగా బకాయిలు చెల్లించని వారి వివరాలను త్వరలో వెల్లడిస్తామ ని మంత్రి పేర్కొన్నారు.

ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి గతంలో ఆర్‌టిసి స్థలాలను లీజుకు తీ సుకొని దానికి సంబంధించిన అద్దెను చెల్లించడంలో నిర్లక్షం వహించారని, ప్రస్తుతం తమ అధికారులు ఇచ్చిన నోటీసులకు జీవన్‌రెడ్డి స్పం దించడంతో పాటు అద్దె చెల్లిస్తున్నారని మంత్రి తెలిపారు. ఇలా చాలామంది అద్దె చెల్లించకుండా స్థలాన్ని వెనక్కి ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం హెచ్చరించారు. జాతరలు, పండుగలకు ప్రత్యేక బస్సులను ప్రయాణికుల కోసం కేటాయించడంతో పాటు ఆయా బస్సుల్లో ప్రయాణించే వారి నుంచి ప్రత్యేక చార్జీలను వసూలు చేయాలన్న నిర్ణయంపై చర్చిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రయాణికుల రద్దీ మేరకు మరో 1,000 కొత్త బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించామని ఆయన తెలిపారు. ప్రతి ఆర్టీసి బస్టాండ్‌లో జీవ బాటిల్‌ను ప్రయాణికులకు అందుబాటులో ఉంచుతామని, వాటిని తక్కువ ధరకు విక్రయిస్తామని తెలిపారు. ఉద్యోగుల, కార్మికుల పెండింగ్ బకాయిలను త్వరలోనే చెల్లిస్తామని ఆయన హామీన్చిరు. ప్రస్తుతం నెలకు రూ.250 కోట్లను ప్రభుత్వం ఆర్టీసికి చెల్లిస్తుందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News