Sunday, December 22, 2024

ఆర్‌టిసి బస్సు డ్రైవర్ కు గుండెపోటు… తప్పిన పెను ప్రమాదం…

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆర్‌టిసి బస్సు డ్రైవర్ గుండె పోటుతో మృతి చెందడంతో బస్సు స్టీరింగ్ ను ఓ ప్రయాణికుడు కంట్రోల్ చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో జరిగింది. మదనపల్లె డిపోకు చెందిన బస్సు చంద్రగిరి మండలం అగరాల వైపు వెళ్తుండగా బస్సు డ్రైవర్‌కు గుండెపోటుతో సీటులోను కన్నుమూశాడు. వెంటనే ఓ ప్రయాణికుడు అప్రమత్తమై స్టీరింగ్ కంట్రోల్ చేయడంతో పాటు సడన్‌గా బ్రేక్ వేసి బస్సును ఆపాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే డ్రైవర్‌ను అంబులెన్స్‌లో స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు డ్రైవర్ మృతి చెందాడని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News