Sunday, December 22, 2024

రోడ్డు ప్రమాదంలో ఆర్ టిసి డ్రైవర్ మృతి

- Advertisement -
- Advertisement -

నల్లబెల్లి: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలోని శనిగరం క్రాస్ రోడ్డు జాతీయ రహదారి 365పై శనివారం రాత్రి చోటు చేసుకుంది.వివరాలలోకి వెళితే.. ఎస్ఐ రాజారాం కథనం ప్రకారం.. అర్వయ్యపల్లి గ్రామానికి చెందిన ఎండీ బాబర్(47) నర్సంపేట ఆర్ టిసి డిపో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా బాబర్ తన విధులను నిర్వర్తించి ఇంటికి వెళ్తున్న క్రమంలో ములుగు జిల్లా మల్లంపల్లి నుంచి వస్తున్న మట్టి లారీ అతివేగంగా వచ్చి అదుపు తప్పి బాబర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది

. దీంతో బాబర్ ప్రాణాపాయ స్థితిలో ఉండగా స్థానికులు, పోలీసులు నర్సంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాబర్ మృతి చెందినట్లు మృతుని భార్య మదార్, కుమారుడు యాకూబ్ తెలిపారు. కాగా మృతుని కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజారాం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News