Sunday, December 22, 2024

వీడియో వైరల్ : పరీక్ష కోసం సెలవు ఇవ్వలేదని.. ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

కొడుకు పరీక్ష కోసం సెలవు అడిగితే ఆ ఉన్నతాధికారి ఇవ్వలేదని టిఎస్ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే దేవరకొండ ఆర్టీసీ డిపోలో శంకర్ నాయక్ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. తన కుమారుడికి ఆదివారం రోజు పరీక్ష ఉందని శంకర్ నాయక్ అడగగా డీఎం రాజీవ్ ప్రేమ్ కుమార్ నిరాకరించారు. దీంతో మనస్తాపం చెందిన శంకర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. తన చావుకు కారణం పై అధికారులేనని శంకర్ వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. వీడియో చూసిన కొందకు ఘటనాస్థలికి చేరుకుని అతన్ని తక్షణమే సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. శంకర్ నాయక్ ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News